
పీవోకు నిర్వాసితుల వినతి
వి.ఆర్.పురం: మండలంలోని వడ్డుగూడెం పంచాయతీ పరిధిలోని 100 కుటుంబాల వీఆర్‌పురం అంబేద్కర్ కాలనీ నిర్వాసితులను కృష్ణా జిల్లా తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నిర్మాణానికి రూ.6 లక్షల ఇవ్వాలని కోరుతూ అంబేడ్కర్ కాలనీవాసులు సోమవారం ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై పీవో సానుకూలంగా స్పందించినట్టు పలువురు కాలనీవాసులు చెప్పారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటానన్నారు . ఈ సందర్భంగా పీడీఎఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి నిర్వాసితులు కోరుకున్న చోట పునరావాసం కల్పించి ఆదుకోవాలని, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రాజు, శ్రీరామ్మూర్తి, శ్రీనివాసు, జయరాజు, వేణు, రాము, కృష్ణ, వెంకట్, మహేష్, రాణి, శ్రావణి అరుణ, పద్మ పాల్గొన్నారు.