ఎటపాక: ఉష్ణగుండాల వద్ద శ్రీఅష్టలక్ష్మి ఆశ్రమంలో జరుగుతున్న 23వ శ్రీఅష్టలక్ష్మి యాగంలో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం కొట్నాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యాగశాలలో అమ్మవారికి అభిషేకాలు,తిరుప్పావై పాశురాల విన్నపం జరిపారు. అనంతరం అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేశారు. పీతాంబరం రఘునాథాచార్యులు స్వామి ఆధ్వర్యంలో పసుపు దంచడం వేడుకను వైభవంగా నిర్వహించారు. రాత్రి దీపోత్సవం,మాతృదేవోభవ పురస్కా ర ఉత్సవం జరిగాయి.ఈకార్యక్రమాల్లో యాగ కమిటీ సభ్యులు గాదె మాదవరెడ్డి,నక్కా భాస్కరరావు,జి.వి. రామిరెడ్డి,రాజా,యడ్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.