
కంటి సమస్యలపై అప్రమత్తం
అరకులోయటౌన్: కంటి సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం శంకర్ ఫౌండేషషన్ సౌజన్యంతో తేజ మెడికల్, జనరల్ స్టోర్ ఓనర్, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు సహకారంతో నిర్వహించిన శిబిరాన్ని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కంటి చూపు లోపంతో ఇబ్బందులు పడుతున్న అవ్వా, తాతలకు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీస్ శాఖలో పనిచేసేవారందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. శిబిరంలో 210 మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 8 మందికి కంటి ఆపరేషన్ చేయాలని గుర్తించారు. మరో 30 మందికి కళ్లద్దాలు అందిస్తామన్నారు. ఓ చిన్నారికి సర్జరీ అవసరం అని, సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ రిలేషన్‌షిఫ్ మేనేజర్ చంద్రశేఖర్, ,డాక్టర్ సమర్ధి దేశ్‌ముఖ్, కౌన్సిలర్‌లు జాన్షీ, తేజ, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, సర్పంచ్ ఉపేంద్ర, అనంతగిరి సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, మయూరి రాజు, దామోదర్ గిరిజనులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక సీహెచ్‌సీని శుక్రవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.వార్డులకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.అనంతరం వైద్యులు,సిబ్బందితో మాట్లాడి ప్రస్తుతం నమోదవుతున్న వ్యాధులు,మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటే సహించేది లేదన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, గర్భిణులకు ఆస్పత్రిలోనే ప్రసవం జరిగిలే చర్యలు తీసుకోవాలని వైద్యులు సంతోష్,ధరణిలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు జగబంధు,మూర్తి,బాలరాజు,సర్పంచులు బాబూరావు,నరసింగరావు,ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి,కమల తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర