డుంబ్రిగుడ: మండలంలోని అరకు–పాడేరు జాతీయ రహదారి బురదగెడ్డ వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని పర్యాటకుల కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కొర్రాయి పంచాయతీ జాకరవలస గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరకు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, పాడేరు నుంచి అరకు వైపు వస్తున్న కారు బురదగెడ్డ మలుపు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరకులోయ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నుజ్జనుజ్జయ్యిందని స్థానికులు
తెలిపారు.