చింతూరు: విద్యార్థులు స్థానిక విద్యను అవకాశంగా మలుచుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన వార్షికోత్సవంలో పాల్గొన్న పీవో మాట్లాడుతూ ప్రస్తుత దశలో విద్య ఎంతో ముఖ్యతమైనదన్నారు. అందరూ కష్టపడి ఇష్టంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగుల్‌మీరా, అధ్యాపకులు హారతి, వెంకటరావు, శేఖర్, రమేష్ పాల్గొన్నారు.