
విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు విశాఖ చేరుకుంది. సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో విచ్చేసిన జట్టు సభ్యుల్ని అభిమానులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. కెప్టెన్ అక్షర్ పటేల్‌తో పాటు జట్టు సభ్యులు, సపొర్టింగ్ స్టాఫ్ విమానాశ్రయం నుంచి నేరుగా నోవోటల్‌కు చేరుకున్నారు. వీరంతా మంగళవారం నుంచి నెట్స్‌లో శ్రమించనున్నారు. విదేశీ ఆటగాళ్లు డుప్లెసిస్, ఫ్రేజర్, ఫెరీరా కులసాగా మాట్లాడుకుంటూ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. డీసీ జట్టు డైరెక్టర్ వేణుగోపాలరావు, హెడ్ కోచ్ హేమంగ బదాని విశాఖ చేరుకున్న వారిలో ఉన్నారు. డీసీ జట్టులో ఆంధ్రా ఆటగాడు త్రిపురాన విజయ్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖ వేదికగా 24న లక్నో సూపర్ జెయింట్స్, 30న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో తలపడనుంది.
అందుబాటులోకి రూ.వెయ్యి టికెట్లు
ఐపీఎల్ సీజన్‌లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభ మ్యాచ్ చూసేందుకు లోయర్ డినామినేషన్ రూ.1000, వరూ.1500 టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. డీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు డిస్ట్రిక్ యాప్‌లోనూ సోమవారం తిరిగి ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయాలు చేస్తోంది. రూ.వెయ్యి టికెట్ ఈ స్టాండ్‌లో, రూ.1500 టికెట్ ఎం–1 స్టాండ్‌లో అందుబాటులోకి తెచ్చింది. లోయర్ డినామినేషన్లలో టికెట్లు తొలి దశలో అందని వారు ఈ టికెట్లు కొనుక్కోవడంతో సాధారణ అభిమానులు స్టేడియంలో కూర్చొని చూసే అవకాశం దక్కింది.

విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

విశాఖ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు