
మృతదేహాలను బంధువులకు అప్పగించండి
● అడ్డతీగల సీహెచ్‌సీని సందర్శించిన డీసీహెచ్‌ఎస్ లక్ష్మి
అడ్డతీగల: గంగవరం రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతదేహాలను సత్వరమే బంధువులకు అప్పగించాలని డీసీహెచ్‌ఎస్ కె. లక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక సీహెచ్‌సీలో ఆమె పరిశీలించారు. వైద్యాధికారి పండా సతీష్‌ను రోడ్డు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులతో మాట్లాడారు. గాయపడిన వారికి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అక్కడ సూపరింటెండెంట్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రమాద బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తానని చెప్పారు.