బాల్య వివాహాలు నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు నిర్మూలించాలి

Nov 28 2024 1:53 AM | Updated on Nov 28 2024 1:53 AM

– కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

రంపచోడవరం: బాల్య వివాహాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించా రు. బాల్యవివాహాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాల్య వివాహం సాంఘిక దురాచారమని చెప్పారు. 18 సంవత్సరాల వయస్సు నిండకుండా బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదని తెలిపారు. జిల్లాలో ప్రతి బాలిక ఒక రోల్‌ మోడల్‌గా ఎదగాలని, పురుషులతో సమాన అవకాశాలను అందిపుచ్చకోవాలని ఆకాంక్షించారు. మంచి భవిష్యత్‌ కోసం బాలికలు బాగా చదవాలన్నారు. డిసెంబర్‌ 7న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత విద్య,భోజ న, వసతి ఏర్పాటు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ కల్పశ్రీ మాట్లాడు తూ బాలికలకు జీవితంలో మంచి భవిష్యత్‌ను ఇచ్చేది విద్య మాత్రమేనని చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బాగా చదువుకోవాలన్నారు. డీఎస్పీ సాయి ప్రశాంత్‌ మాట్లాడుతూ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తమకు సమాచారం ఇవ్వలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ విజయశాంతి, ఏడీఎంహెచ్‌వో శిరీష,తహసీల్దార్‌ ఎ.ఎస్‌.రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, సీడీపీవో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

పాడేరు : బాల్య వివాహాలు సామాజిక దురాచారమని, బాల్య వివాహాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్‌ స్పష్టం చేశారు. స్థానిక కేజీబీవీలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీఓ అభిషేక్‌ ముఖ్య అతిధిగా హాజరై ప్రసగించారు. బాల్య వివాహా రహిత సమాజమే లక్ష్యంగా అందరు కృషి చేయాలన్నారు. బాలికలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవ్నాన్నారు. గిరిజన సమాజం ఎదగాలంటే బాలికలు బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలన్నారు. ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందన్నారు. లక్ష్యాలను నిర్ధేశించుకొని బాగా చదువుకోవాలని చెప్పారు. డీఎస్పీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ శారీరకంగా, మానసికంగా ఎదుగుదల వచ్చాక వివాహాలు చేసుకోవాలని సూచించారు. ఎవరైన వేధింపులకు గురి చేస్తే 1098 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే తమల్ని సంప్రదించాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా, సీడీపీవో ఝాన్షీలక్ష్మి, డీసీపీవో డాక్టర్‌ సద్దు, అడ్వకేట్‌ ప్రసాద్‌నాయుడు, కేజీబీవీ పాఠశాల ఉపాద్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అరకులోయటౌన్‌ : కేంద్ర ప్రభుత్వ బాల్య వివాహ్‌ ముక్త్‌ భారత్‌ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీడీవోలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాల ముక్తి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని పలువురు సూచించారు. విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలన్నారు. కౌమర దశలో ఉన్న విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బాల్య వివాహాల జరిగించేందుకు ఎవరైనా ప్రలోభ పేడుతుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థుఽలచే ర్యాలీలు, మానవహారం నిర్వహించి, బాల్య వివాహలను అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.

అరకులోయ: స్థానిక జూనియర్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో అడ్వకేట్‌ మురళీమోహన్‌ బాలిక హక్కులు, చట్టాల గురించి విద్యార్థులకు సూచించారు. తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ : మండలంలోని కిల్లోగుడలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో నీలిమ, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేట మండలంలోని జరిగిన కార్యక్రమంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను స్థానికులు వివరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అత్యచారాలు అరికట్టెందుకు కృషి చేయాలని కోరారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు అవగాహాన కల్పించాలని కోరారు. సీడీపీవో బాలచంద్రమణి దేవి, ఈవోపీఆర్డీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో విజయకుమారి మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిగితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువుల రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. సూ పర్‌వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు

చింతూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పలువురు అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలకు అందరూ దూరంగా ఉండాలని, దీనిపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. జనకళ్యాణ్‌ వెల్ఫేర్‌ సొసైటీ చైర్మన్‌ నాగేశ్వరరావు, తహసీల్దార్‌ చిరంజీవి, ఎంపీడీవో చైతన్య, సీడీపీవో విజయగౌరి, ఐటీడీఏ ఏవో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గంగవరం: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, ఎంపీడీవో పీజీ.రామకృష్ణ, ఎస్‌ఐ భూషణం, సీడీపీవో సీహెచ్‌.లక్ష్మి, ఉపాధి ఏపీఓ ప్రకాష్‌, వెలుగు ఏపీఎం షణ్ముఖరావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు సత్యవతి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగి: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో దేవమణి , సూపర్‌వైజర్‌ అరుణ లత, హెచ్‌ఎం నాగ సుశీల తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు నిర్మూలించాలి1
1/4

బాల్య వివాహాలు నిర్మూలించాలి

బాల్య వివాహాలు నిర్మూలించాలి2
2/4

బాల్య వివాహాలు నిర్మూలించాలి

బాల్య వివాహాలు నిర్మూలించాలి3
3/4

బాల్య వివాహాలు నిర్మూలించాలి

బాల్య వివాహాలు నిర్మూలించాలి4
4/4

బాల్య వివాహాలు నిర్మూలించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement