● గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు
గూడెంకొత్తవీఽధి: రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పాటి పుల్లయ్య, డిప్యూటీ మేట్రిన్ సునితకు గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు మంగళవారం షోకాజ్ నోటీసులిచ్చారు. ఇదే ఆశ్రమ పాఠశాలలో కొద్ది రోజుల క్రితం తాగునీరు లేదని బాలికలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ఈ సమస్యను ముందుగా అధికారులకు చెప్పకపోవడంపై డీడీ ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. ఈ విషయంలో హెచ్‌ఎం, డిప్యూటీ మేట్రిన్ నిర్లక్ష్యాన్ని గుర్తించిన డీడీ వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. సంజాయిషి సంతృప్తికరంగా లేకుంటే తదుపరి చర్యలు కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకుంటామని చెప్పారు.