
బోల్తా పడిన ట్రాక్టర్
అరకులోయ టౌన్: మండల కేంద్రంలోని బురదగెడ్డ వద్ద ఆదివారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ అదుపు తప్పి గెడ్డలోకి బోల్తా పడింది. అరకులోయ నుంచి మట్టి లోడుతో యండపల్లివలస వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి గెడ్డలో పడిపోయింది. వెంటనే డ్రైవర్ కోటేశ్వరరావు ట్రాక్టర్ పైనుంచి బయటకు దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ట్రాక్టర్ యూనియన్ కార్మికులు సంఘటన స్థలానికి చేరుకొని గెడ్డలో పడిన ట్రాక్టర్‌ను బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.