దంపతులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
వై.రామవరం: పెట్రోల్ లీక్ కారణంగా మంటలు ఎగిసి బైక్ దగ్ధమైంది. బైక్‌పై ఉన్న భార్యాభర్తలు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన కోలిపల్లి పైడిరాజు దంపతులు బైక్‌పై ఆదివారం అడ్డతీగల వెళ్లి వై.రామవరం మండలం చవిటిదిబ్బలు గ్రామానికి తిరిగి వస్తున్నారు. అడ్డతీగల మండలం చిన్నవడిసికర్ర గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకు నుంచి పెట్రోల్ లీకై ఇంజిన్‌పై పడటంతో మంటలు ఎగిశాయి. గమనించిన భార్యాభర్తలు వెంటనే బైక్ నుంచి దిగి దూరంగా వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటల్లో పూర్తిగా కాలిపోయింది.