వెట్టిచాకిరీ నుంచిబాలలకు విముక్తి

నెలరోజులపాటు దాడులు

జిల్లా కార్మిక శాఖ ఇన్‌చార్జి సుజాత

పాడేరు రూరల్‌ : జిల్లాలోని అన్ని మండలాల్లో నెలరోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తామని జిల్లా కార్మిక శాఖ ఇన్‌చార్జి టి. సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వ్యవస్థ మాసోత్సవాలు ఈనెల ఒకటి నుంచి ప్రారంభమయ్యాయని, నెలాఖరు వరకు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో బాల కార్మికులను విముక్తి చేయడానికి కార్మిక శాఖ, ఇతర అనుబంధ శాఖలతో కలిసి 14ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న వివిధ దుకాణాలు, వ్యాపార సముదాయాలు, సంస్థలపై దాడులు నిర్వహించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఎక్కడైనా బాల లను పనిలో పెట్టుకుంటే తెలిసిన వారు తమ కు సమాచారమివ్వాలని ఆమె సూచించారు.




 

Read also in:
Back to Top