
కొయ్యూరు డ్వాక్రా మహిళలకు రుణాల చెక్కు అందజేస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
● కలెక్టర్ సుమిత్‌కుమార్
సాక్షి, పాడేరు: డ్వాక్రా మహిళలంతా ప్రభుత్వం బ్యాంకుల సహకారంతో అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ కోరారు. కొయ్యూరు మండలంలోని 48 మహిళా సంఘాలకు కొయ్యూరు గ్రామీణ వికాస్ బ్యాంకు మంజూరు చేసిన రూ.1.24 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును శుక్రవారం స్థానిక ఐటీడీఏలో కలెక్టర్ పంపిణీ చేశారు.ఐటీడీఏ పీవో వి.అభిషేక్, ట్రైనీ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్‌డీఏ పీడీ మురళీ, వెలుగు అధికారులు పాల్గొన్నారు.