ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పోరాటం, త్యాగాలు అసాధారణ మని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఉద్యమకారులను శా లువా, పూలమాలతో సన్మానించారు. ఎమ్మె ల్యే శంకర్ మాట్లాడుతూ, ఉద్యమకారుల సంక్షేమాన్ని గత, ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమకారుల కు పెన్షన్‌తో పాటు ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తవిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యమకారులు కారింగుల దామోదర్, మేకల మల్లన్న, రామోజీ ఆంజనేయులు, కళాకారుడు రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు పాల్గొన్నారు.


