అర్హులందరికీ ‘ఇందిరమ్మ’ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ‘ఇందిరమ్మ’ ఇళ్లు

Jun 2 2026 11:51 PM | Updated on Jun 2 2026 11:51 PM

నేరడిగొండ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ పథకం ద్వారా గృహ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన ఆడిగెం లక్ష్మీ–ప్రభాకర్‌ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరై ప్రారంభించారు. ‘మీ ఇంటికి వచ్చి ఇల్లు ఇస్తా.. మీరు ఎక్కడికి తిరగొద్దు’ అని అర్హులైన వారికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, హౌసింగ్‌ శాఖ అధికారులు, మాజీ ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, స్థానిక సర్పంచ్‌ జ్యోతి, సీనియర్‌ నాయకులు అనిల్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రాజు, నజీర్‌, రవీందర్‌ రెడ్డి, భారత్‌, శ్రీను, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement