సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు రైతులు గిట్టుబాటు ధరల కోసం సోమవారం తలపెట్టిన గుంటూరులో పొగాకు బోర్డు అధికారులతో రైతుల రాయబారం కార్యక్రమానికి సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 125 మంది రైతులు తరలివెళ్లారు. మైనంపాడు, చలప్పాలెం, రుద్రవరం, ఎనికపాడు, మంగమూరు, వేములపాడు, ఎండ్లూరు, మద్దులూరు తదితర గ్రామాల నుంచి రైతులు కార్యక్రమానికి తరలివెళ్లారు. రైతులు కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చే సందర్భంలో బొల్లాపల్లి టోల్ గేట్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావుని రైతులు కలిశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కరిచేటి హనుమంతరావు, ఎన్ వీ నరసింహం, నాయకులు కిలారి పెద్దబ్బాయి, బంకా సుబ్బారావు, నెరుసుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


