ఒంగోలు సిటీ: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం ఒంగోలులోని ముంగమూరు రోడ్డులోని వీఆర్ భవన్‌లో విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో ఆల్‌ఇండియా స్థాయిలో మా విద్యార్థులు 13 మంది ఐఐటీలో సీట్లు, బిట్స్ పిలానీలో ఆలిండియా స్థాయిలో ఆరుగురు అత్యధిక మార్కులు సాధించినట్లు తెలిపారు. పి.హనీ 1891 ర్యాంకు, వీ రోహిత 3030 ర్యాంకు, వై.రిషిత్ కుమార్‌రెడ్డి 3390, పి.వాసు 3732, జి. కృషితా ఏంజెల్ 4142, షేక్ అక్రమ్ 4392, కె.అవినాష్‌రెడ్డి 5120, కె.అషిష్ నిహాల్ 5,671, బీ వైష్ణవి 5,679, ఎంఏవీ సాయిదుర్గా ప్రసాద్ 5817, వై.మహిమా తేజస్విని 7214, వై.శాన్సీ 9982, ఎస్.సహస్ర శంకర్ 15935 ర్యాంకులు సాధించారు. బిట్స్ పిలానీ 2026లో ఆల్ ఇండియా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన ఎం. అఖిల్ 227 మార్కులు, కె.అవినాష్‌రెడ్డి 219 మార్కులు, వై.రిషిత్ కుమార్‌రెడ్డి 215, ఎస్.సహస్ర శంకర్ 198, వై.శాన్సీ 180, సిహెచ్. వెంకట్‌కళ్యాణ్ 179 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఆలిండియా స్థాయిలో గర్తింపు తీసుకురావడానికి సహకరించిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు, ఫలితాలు సాధించడానికి కృషి చేసిన డైరెక్టర్ ఎ.గణేష్‌రెడ్డి, ఎ.గంగా శంకరరెడ్డి, డీన్స్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.


