మన డబ్బులు మన లెక్కలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మన డబ్బులు మన లెక్కలపై అవగాహన

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

మన డబ్బులు మన లెక్కలపై అవగాహన నారాయణస్వామి ఆదాయం రూ.2.41 లక్షలు

సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్‌): మన డబ్బులు మన లెక్కలు.. అనే కార్యక్రమంపై సంతనూతలపాడు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం వెలుగు శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్‌ సభ్యులకు అవగాహన కార్యక్రమం, అనంతరం ర్యాలీ నిర్వహించారు. మైనంపాడు, గంగవరం, చిలకపాడు, సంతనూతలపాడు కేంద్రాల్లో డ్వాక్రా గ్రూపు సభ్యులకు శిక్షణ ఇచ్చారు. ఈనెల ఆరో తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని వెలుగు ఏపీఎం బాబురావు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో వెలుగు సీసీలు చెంచులక్ష్మి, శ్రీనివాసులు, రామాంజనేయులు, శ్రీనివాసరావు, వీవోఏలు, ఈనారిలు, డాక్రా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.

సీఎస్‌పురం(పామూరు): మండలంలోని మిట్టపాలెం నారాయణస్వామివారి ఆలయానికి ఆదివారం రూ.2.41 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎస్‌జిఆర్‌. నరసింహబాబు, ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ సోమవారం తెలిపారు. స్వామివారి దర్శనం టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.97,220, లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,680, శాశ్వత అన్నదానం పథకం నిర్వహణకు విరాళాలుగా రూ.25,281, మహాప్రాకార నిర్మాణానికి రూ.40,116 పంచామృతాభిషేకానికి విరాళంగా రూ.38,612, ఇతర విరాళాలుగా రూ.2,500 వేలు, అదేవిధంగా దాతలు వెండి శంఖు, వస్తువులు విరాళాలుగా వచ్చినట్లు ఈవో, ధర్మకర్త తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement