వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
కై లాస్‌నగర్: జనగణన కా ర్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సెన్సస్–2027పై స్థానిక టీటీడీసీలో ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ సోమవారంతో ముగిసింది. కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రణాళికల రూపకల్పన, సంక్షేమ పథకాల అమలుకు జనగణన కీలకమన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో ప్రతీ వ్యక్తి వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలన్నారు. ఇళ్ల జాబితా తయారీ, గృహగణనలో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్,ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, పర్యవేక్షకులు నలంద ప్రియ, మాస్టర్ ట్రైనర్లు కె.శ్రీహరి బాబు, యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.


