ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు సన్మానం

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

ఆదిలాబాద్‌: ఇటీవల జరిగిన సీఎం కప్‌ రెండో ఎడిషన్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సన్మానించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి సత్కరించారు. టీఎంఎస్‌ఎస్‌ ఉట్నూర్‌, ఖానాపూర్‌ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ పోటీల్లో పతకాలతో సత్తా చాటారు. రా బోయే రోజుల్లో మరిన్ని వేదికల్లో సత్తా చాటాల ని ఆ కాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులకు నెహ్రూ జువాలజీకల్‌ పార్క్‌, అంబేద్కర్‌ విగ్రహం, హుస్సేన్‌ సాగర్‌ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శింపజేశారు. ఉత్సాహంగా గడిపిన ఎమ్మెల్యే వారితో డిన్నర్‌ చేశారు. సన్మానం పొందిన వారిలో పతకాలు సాధించిన ఎస్‌.నవీన్‌, యు.గణేశ్‌, ఎం.మారుతి, ఎమ్‌.నిఖిల్‌ కుమార్‌, ఎస్‌.శంకర్‌, కె.సురేందర్‌, ఆర్‌.శివసాయి, ఏ.యాదవ్‌ శావ్‌, పి.హనుమంతరావు, హెచ్‌ కె.నగేశ్‌ ఉన్నారు. క్రీడాకారులతోపాటు జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, నిర్మల్‌ డీవైఎస్‌ఓ శ్రీకాంత్‌ రెడ్డి, శిక్షకులు శివ, రాజకుమార్‌, హెచ్‌డబ్ల్యూఓ గంగారం తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement