ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అన్నారు. ‘ప్రజాపాలన– ప్రత్యేక ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శాంతినగర్‌లోని పుత్లీబౌలి అర్బన్ హెల్త్ సెంటర్‌లో సోమవారం ప్రత్యే క వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం స్పెషలిస్టు వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో సాధన, కౌన్సిలర్ నజీర్, స్పెషలిస్ట్ వైద్యులు సందీప్ కుమార్, దీపక్, ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్ చంద్రకళ, సీవో నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం తీసుకోవాలి
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్– ఈకో క్లబ్ ఆధ్వర్యంలో ఆహార ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, ప్రిన్సిపాల్ డా.అతిక్ బేగం, వైస్ ప్రి న్సిపాల్ రఘు గణపతి, కోటయ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


