ఖానాపూర్/జన్నారం: తెలంగాణ లెజిస్లేచర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026 కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్టెప్పులు వేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే కళల పట్ల తన ఆసక్తితో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, తదితరులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఆయన చేసిన నృత్యం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. పోటీల్లో రాణించిన వారికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.


