ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉల్లాస్ కా ర్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాలలో చ దువు చేర్చుకున్న వారికి ఆదివారం ఎఫ్‌ఎల్‌ఎన్‌టీ, ఎన్‌ఐవోఎస్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 522 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లలో ఈ పరీక్ష ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. 14,186 మంది హాజరు కావాల్సి ఉండగా, 11,908 మంది (84 శాతం) హాజరైనట్లు వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారికి త్వరలో సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జైనథ్, బేల, భోరజ్ తదితర మండలాల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఓపెన్‌స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తదితరులు ఉన్నారు.
పలు కేంద్రాలను పరిశీలించిన డీఆర్డీవో
ఇంద్రవెల్లి: సెర్ప్ ఆధ్వర్యంలో మండలకేంద్రంతోపాటు పలు పంచాయతీ కార్యాలయాల్లో స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్య సభ్యులకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో మంజుల, సీసీలు మోతిరాం, శ్రీరాం, పరశురాం, బాలాజీ, విఠల్‌రావ్, సునీత, భీమవ్వ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


