ఇచ్చోడ: మండలంలోని మేడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, డివిజన్ కార్యదర్శి ఆత్రం మహేందర్, మాన్కపూర్ సర్పంచ్ మాడవి భీంరావు డిమాండ్ చేశారు. ఆదివారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి వారు మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా విద్యార్థులకు తాగునీరు అందించకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడంలో విఫలమైనట్లు విమర్శించారు. ఈ క్రమంలో తాము ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు.


