● కలెక్టర్, బ్యాంకు ప్రత్యేకాధికారి రాజర్షి షా
కై లాస్‌నగర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్, బ్యాంకు ప్రత్యేకాధికారి రాజర్షి షా అన్నారు. పట్టణంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన 98వ మహాజన సభ నిర్వహించారు. బ్యాంకు ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్ అంచనాలు, ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్యాక్స్ పరిధిలో రుణాల రికవరీ ఆశించిన స్థాయిలో లేనిచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రికవరీ రేటును పెంచడం ద్వారానే బ్యాంకు బలోపేతం అవుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో డీసీసీబీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సహకార సంఘాల బలోపేతం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తుందన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో రవి కుమార్, జీఎం సూర్య ప్రకాష్, డీఆర్ ఓఎస్డీ సింహాచలం పాల్గొన్నారు.


