వడగళ్ల వర్షం | - | Sakshi
Sakshi News home page

వడగళ్ల వర్షం

Mar 23 2026 9:13 AM | Updated on Mar 23 2026 9:13 AM

అడ్డతీగల: ఆకాశంలో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముకోవడంతో ఆదివారం మధ్యాహ్నం అడ్డతీగలలో భారీ వడగళ్ల వర్షంన కురిసింది. దీనికి ఈదురు గాలులు తోడవ్వడంతో చెట్ల కొమ్మలు ఎక్కడికక్కడ విరిగిపడి, ప్రజా జీవనం స్తంభించింది. సుమారు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అప్పటి వరకూ ఎండ వేడిమికి ఇబ్బంది పడిన ప్రజలు ఒక్కసారిగా ఏర్పడిన చల్లటి వాతావరణంతో సేద తీరారు. ఈదురు గాలుల తీవ్రంతకు అడ్డతీగల – వేటమామిడి రోడ్డులోని ఏకలవ్య పాఠశాల వద్ద చెట్ల కొమ్మలు పడిపోయి 33 కేవీ లైన్లు తెగిపడ్డాయి. దీంతో, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, గంగవరం మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు వెంటనే స్పందించి లైన్లు సరి చేసి, స్తంభాలపై ఇన్సులేటర్లు అమర్చారు. విద్యుత్‌ సరఫరాను సాయంత్రానికి పునరుద్ధరించారు. ఈదురు గాలులు, భారీ వర్షం వల్ల అడ్డతీగల చుట్టుపక్కల గ్రామాల్లో అరటి తోటల రైతులకు నష్టం వాటిల్లింది. అరటి తోటలు ఒరిగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement