ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ కోసం..
తాంసి: ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వేలైన్ కోసం ఏళ్లుగా ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ రైల్వేలైన్ నిర్మాణ కోసం జిల్లాలోని ఓ నూతన పంచాయతీ తొలి తీర్మానం చేసి ఆమోదించింది. భీంపూర్ మండలంలోని వడూర్ పంచాయతీలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం సర్పంచ్ కుడుకల దత్తు యాదవ్ అధ్యక్షతన తొలి గ్రామసభ నిర్వహించారు. ఇందులో ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ నిర్మాణం కోసం కృషి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన ప్రతిని పాలకవర్గ సభ్యులు ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ నిర్మాణ సాధన సమితి అధ్యక్షుడు నారాయణ యాదవ్‌కు అందజేయడంతో పాటు ఉన్నతాధికారులకు సైతం పంపారు.


