పోలింగ్ సరళి ఇలా..
ముగిసిన పల్లె సమరం ప్రశాంతంగా మూడో విడత ఎన్నికలు జిల్లాలో 82.56 శాతం పోలింగ్ బరంపూర్‌లో ఈ సారి ఏకగ్రీవానికి బ్రేక్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జరిగిన జీపీలు శాతం
ఓటు హక్కు
వినియోగించుకున్న యువతి
బోథ్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఓటర్లు
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. జిల్లాలోని 472 (రుయ్యాడి మినహా) గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో భాగంగా బోథ్ ని యోజకవర్గంలోని బజార్‌హత్నూర్, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్, సొనాల, తలమడుగు మండలాల్లోని 120 సర్పంచ్, 479 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరిగాయి. తలమడుగు మండలం బరంపూర్‌లో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాలకు వ చ్చిన ఓటర్లకు అధికారులు పూలు చల్లుతూ స్వా గతం పలికారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రా రంభం కాగా చలితీవ్రత కారణంగా తొలి రెండు గంటల్లో మందకొడిగా సాగింది. తర్వాత ఓటర్లు కేంద్రాలకు తరలిరావడంతో పోలింగ్ పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా కేంద్రాల లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు హక్కు వి నియోగించుకునే అవకాశం కల్పించారు. దీంతో ప లుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వృద్ధుల నుంచి యువత వరకు ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 82.56 శాతం పోలింగ్ నమోదైంది. మలి విడతతో పోల్చితే 4.12 శాతం తగ్గింది. ఆయా మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి పోలింగ్ సరళిపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలి రెండు గంటలు నామమాత్రమే...
ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలుచోట్ల మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. ఆయా మండలాల పరిధిలో 1,24,880 మంది ఓటర్లు ఉండగా, 1,03,104 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60,744 మంది పురుష ఓటర్లకు గాను 50,597 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 64,134 మందికి గాను 52,507 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా ఓటర్లు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9గంటల వరకు కేవలం 19.37 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. తర్వాత పుంజుకుంది. తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్‌చైర్ సౌకర్యం కల్పించారు. పోలింగ్ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 77.95 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ కొనసాగింది. చివరకు 82.56 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్ శాతం వివరాలను ప్రకటించారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఎన్నికలు జరిగిన ఆయా మండలాల్లోని పలు పో లింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న వేర్వేరుగా పరిశీ లించారు. పోలింగ్ ప్రక్రియపై ఆరా తీశారు.
రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు..
తుది విడతలో నమోదైన పోలింగ్ శాతం వివరాలు
మండలం ఎన్నికలు మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు పోలింగ్
బజార్‌హత్నూర్ 26 21,980 17,560 8,786 8,774 79.89
బోథ్ 18 25,364 20,282 9,805 10,477 79.96
గుడిహత్నూర్ 20 22,695 18,360 9,102 9,258 80.90
నేరడిగొండ 23 19,719 16,630 7,963 8,667 84.33
సొనాల 12 10,804 9,131 4,558 4,573 84.51
తలమడుగు 20 24,318 21,141 10,383 10,758 86.94
21.88 53.57 74.51
15.71 47.73 74.32
19.11 58.11 79.00
17.85 50.94 76.84
17.86 55.56 81.25
23.07 61.19 83.32
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత భోజన వి రామం అనంతరం సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. తొ లుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా పంచాయతీల ఫలితాలు ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
పోలింగ్ సరళి ఇలా..
పోలింగ్ సరళి ఇలా..
పోలింగ్ సరళి ఇలా..
పోలింగ్ సరళి ఇలా..
పోలింగ్ సరళి ఇలా..


