మహాత్ముడి పేరు తొలగింపు సరికాదు
కైలాస్‌నగర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడి పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షు డు డాక్టర్ నరేశ్ జాదవ్ అన్నారు. గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌చౌక్‌లో గాంధీజీ చిత్రపటాలతో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కక్షపూరితంగా గాంధీజీ పేరును ఉపాధిహామీ పథకం నుంచి కుట్రపూరితంగా మా ర్చిందన్నారు. పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రత రం చేస్తామని హెచ్చరించారు. ఇందులో డీసీ సీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


