నిఘా నీడన ఎన్నికలు..
ఆదిలాబాద్‌టౌన్: మూడో విడత ఎన్నికలో ని ఘా నీడన సాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప టిష్ట బందోబస్తు మధ్య నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్‌తో పాటు అదనపు ఎస్పీ, డీఎ స్పీలు, సీఐలు, ఎస్సైలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రాల వద్ద గుమిగూడిన 80 మందిపై కేసులు నమోదు చేశారు. సుంకిడి, తలమడుగు, రుయ్యాడి, దేవాపూర్, బరంపూర్, బోథ్, సొ నాల, గుడిహత్నూర్ తదితర గ్రామాల్లో ఎన్ని కల ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలుపొందిన వారు విజ యోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని, బా ణసంచా పేల్చవద్దని అభ్యర్థులకు సూచించా రు. నిబంధనలను అతిక్రమిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరు మండలాల్లో నిర్వహించిన ఎన్నికలకు 938 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.


