సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం
ఆదిలాబాద్: సీసీఐ ఉద్యోగుల బకాయిలు చెల్లి స్తామని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజయ్ భాంగ్రా అన్నారు. ఆదిలా బాద్ సీసీఐ ఉద్యోగుల సమస్యలపై స్థానిక ఎంపీ గోడం నగేశ్ ఢిల్లీలో చైర్మన్‌ను మంగళవారం కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన స్పందించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగులకు సంబంధించి వీఎస్‌ఎస్ బెని ఫిట్స్, బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా కృషి చేస్తామన్నారు. స్థానికంగా అధికారులు లేకపోతే ఢిల్లీ నుంచే నేరుగా ఆదేశాలిచ్చి, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎంపీ వెంట ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్, నిరంజన్ రావు ఉన్నారు.


