పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర విజిలెన్స్ ఆరా
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర విజిలెన్స్ అధికారులు జిల్లాకేంద్రంలో పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు. స్థానిక మార్కెట్ యార్డులో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. 8 మందితో కూడిన అధికారుల బృందం సభ్యులు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్న పత్తి వివరాలు సేకరించారు. తూకంలో తేడాలను పరిశీ లించారు. రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నా రు. కాంటాలు, సీసీఐ కొనుగోలు చేసిన పత్తి వివరాలు, మార్కెట్ యార్డులో లైసెన్సులు, సీసీ కెమెరాల పనితీరుతో పాటు పింజపొడవు, తేమ శాతం పరిశీలించారు. 1వ కాంటాను పరిశీలించి 5 కిలోల తేడాను గమనించారు. అధికారులను ప్రశ్నించారు. కాంటా బయట ఉండడంతో తేడాలు వస్తాయని అధికారులు తెలిపారు. కిసాన్ యాప్ ఏవిధంగా పనిచేస్తుందని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సమయంలో ఓ పత్తి బండి మార్కెట్ యార్డులో తేమ శా తం తక్కువ ఉండగా, జిన్నింగ్‌లో ఎక్కువగా రావడంతో సదరు రైతు ఆ బండిని తీసుకొని మార్కెట్ కు వచ్చాడు. అక్కడే ఉన్న అధికారులకు విషయాన్ని తెలియజేశాడు. దీంతో వారు జిన్నింగ్‌కు వెళ్లి ప రిశీలించారు. జాగృతి నాయకులు వేణుగోపాల్ యాదవ్ రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఫింగర్‌ప్రింట్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పత్తి, సోయా కొనుగోళ్లకు ఫింగర్‌ప్రింట్ నిబంధన తొలగించా లని, కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఒకరు వచ్చి విక్రయించేలా చర్యలు చేపట్టాలని కోరారు. విజిలెన్స్ అధికారుల్లో అనిల్ కుమార్, దినేష్‌చంద్ర, వరుణ్‌ప్రసాద్, ప్రశాంత్‌రావులు ఉన్నారు. వీరి వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్కెటింగ్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఏవో నగేష్‌రెడ్డి, రైతులు ఉన్నారు.


