ఎన్నికల సిబ్బంది కష్టాలు
రోడ్డుపై కూర్చున్న ఉద్యోగులు, సిబ్బంది
మూడో విడత ఎన్నికల విధుల నిర్వహణ కోసం మండలానికి మంగళవారం చేరుకున్న సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి సరిపడా కుర్చీలు, బల్లలు కరువయ్యాయి. దీంతో చాలా మంది రోడ్డు పక్కన, చెట్ల నీడన నేలపైన కూర్చొని రికార్డులు, సామగ్రిని సరిచూసుకోవాల్సి వచ్చింది. ఏర్పాట్ల తీరుపై వారు అసహనం వ్యక్తం చేశారు.
– నేరడిగొండ
ఎన్నికల సిబ్బంది కష్టాలు


