ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్/బోథ్/గుడిహత్నూర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈమేరకు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల ని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎన్నికలు ని ర్వహించే బోథ్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్, బోథ్ పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆరు మండలా ల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్టా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్ (144) సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 33 సమస్యాత్మక కేంద్రాల్లో స్పెషల్ పార్టీ బలగాలు, 10 షాడో పోలింగ్ స్టేషన్లలో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 మంది ఎస్సై స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమస్యాత్మక ప్రాంతాల్లో స్టాటిక్‌ఫోర్స్ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. బందోబస్తులో ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళ సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు, సాయుధ సి బ్బంది, స్పెషల్ పార్టీ ఫోర్స్ ఉంటుందని వివరించారు. జీపీ ఎన్నికల్లో ఇప్పటివరకు జిల్లాలో 756 వ్యక్తులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించిన 70 కేసుల్లో 200 మందికి పైగా ఉన్నట్లు వివరించారు. అలాగే 20 ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేసినట్లు చెప్పారు. రూ.20లక్షల విలువ చేసే 2,250 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టినా, కించపర్చేలా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారం ముగిసిన సందర్భంలో బయట వ్యక్తులు గ్రామాల్లో ఉండరాదన్నా రు. ఎలాంటి సమాచారమైనా డయల్ 100కు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రా రంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బోథ్ మండలకేంద్రంలో పోలీసులు సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
నేరడిగొండ: మండలంలోని లింగట్ల, బొందిడి గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై పోలీసులు అవగాహన కల్పించారు. ఓటర్లు నిర్భయంగా ఓ టు హక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సూ చించారు. ఇందులో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ రమేశ్, ఎస్సై ఇమ్రా న్, తదితరులున్నారు.


