ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
గుడిహత్నూర్: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహి ంచాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి విచ్చేసిఅధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట తహసీ ల్దార్ కవితారెడ్డి, ఎంపీడీవో ఇంతియాజ్, ఎంఈవో ఉదయ్‌రావ్, అధికారులు ఉన్నారు.
తలమడుగు: మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రాజమోహన్, సిబ్బంది తదితరులున్నారు.


