ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ఫుట్‌బాల్‌లో రాణిస్తున్న విద్యార్థులు కోచ్‌ల పర్యవేక్షణలో నిత్య సాధన రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ పతకాలు సాధిస్తున్న క్రీడాకారులు
స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొడతా
ఆసిఫాబాద్‌రూరల్: నేను మా కోచ్ రవికుమార్ సూ చనలు, పలహాలు పాటిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూ డుసార్లు, జాతీయ స్థాయి పోటీల్లో 2023, 2024లో పాల్గొన్నాను. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధి స్తా. ఇదే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాను.
– దుర్గాదేవి, పదో తరగతి
(గిరిజన బాలికల గురుకుల పాఠశాల)
రోజూ సాధన చేస్తున్నాను
ఆసిఫాబాద్‌రూరల్: నేను ఫుట్‌బాల్ పోటీల్లో 2023, 2025లో రెండుసార్లు జాతీయ స్థాయిలో పాల్గొన్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా పతకాలు సాధించాను. భవిష్యత్‌లో ఫుట్‌బాల్ కోచ్‌గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదద్దడమే నా లక్ష్యం. ఇదే లక్ష్యంతో రోజూ సాధన చేస్తున్నాను. – భూమిక, ఎనిమిదో తరగతి
(గిరిజన బాలికల గురుకుల పాఠశాల)
ఇండియా కోచ్ కావాలని ఉంది
ఆసిఫాబాద్‌రూరల్: ఇప్పటివరకు 10మంది జాతీ య, 30మంది రాష్ట్ర స్థా యిలో ఆడి ఐదు బంగారు పతకాలు సాధించారు. వి ద్యార్థినులను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాను. 2014లో మ ధ్యప్రదేశ్‌లో తెలంగాణ కోచ్‌గా ఎంపికయ్యా ను. ఇండియా కోచ్‌గా ఎంపికవ్వడమే లక్ష్యం.
– రవికుమార్, ఫుట్‌బాల్ కోచ్
(గిరిజన బాలికల గురుకుల పాఠశాల)
కోచ్‌ల సహకారంతోనే..
ఫుట్‌బాల్ ఆటపై ఉన్న ఆసక్తితో మేము వివిధ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నాం. కోచ్‌లు ఇమ్రాన్, అంబాజీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మిగతావారు కూడా ఈ క్రీడలో రాణించేలా కృషిచేస్తాం. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న క్రీడతో ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించవచ్చు. – అల్లం సాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు విద్యార్థులు చదువుతోపాటు ఫుట్‌బాల్ ఆటలోనూ రాణిస్తున్నారు. కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొంది రాటుదేలుతున్నారు. బాల్ కొడితే గోల్ పడాల్సిందే.. అన్న రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి పతకాలు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులపై కథనం..
తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మరింత రాణించొచ్చు
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న గాలిపెల్లి అను ఫుట్‌బాల్ ఆటలో రాణిస్తోంది. మందమర్రి మండలానికి గుర్తింపు తెస్తోంది. గత నెల 15 నుంచి 17వరకు నల్గొండ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–17 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. డిసెంబర్ 17నుంచి 19వరకు జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్, పీడీ చిన్నక్క అను కి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థిని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తుందని అభినందించారు. అను మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఫుట్‌బాల్‌లో రాణిస్తున్నానని తెలిపింది. విద్యార్థులను పేరెంట్స్ ప్రోత్సహిస్తే వారు వారికి నచ్చిన క్రీడల్లో సత్తా చాటుతారని పేర్కొంది.
రాటుదేలుతూ.. రాణిస్తూ..
కాగజ్‌నగర్ టౌన్: సిర్పూర్(టీ) కాగజ్‌నగర్‌లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఫుట్‌బాల్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. స్టేట్ లెవల్ మహిళా కోచ్ మాసవేని వనిత శిక్షణలో రాటుదేలుతున్నారు. మైదానంలోకి దిగారంటే గోల్ కొట్టాల్సిందే.. అనే రీతిలో వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అందరి ప్రశంసలు పొందుతున్నారు. 30మంది విద్యార్థులు, 30 మంది విద్యార్థినులు రోజూ ఉదయం 5.30నుంచి 6.30 గంటల వరకు, సెలవు దినాల్లోనూ 4 నుంచి 5గంటల వరకు సాధన చేస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో రాణించిన రాజేశ్వరి
దహెగాం: మండలంలోని చినరాస్పెల్లి గ్రామానికి చెందిన ఎల్కరి రాజేశ్వరి ఫుట్‌బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో రాణించింది. జిల్లా స్థాయిలో రాణించడంతో రాష్ట్ర స్థాయికి ఎంపికై ంది. చినరాస్పెల్లి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుకుంటోంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తోంది. నవంబర్ 14నుంచి 16వరకు నల్గొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆడి మంచి పేరు తీసుకురావాలన్నదే తన లక్ష్యంగా రాజేశ్వరి పేర్కొంది.
డేట్ అకాడమీని ఓపెన్ చేస్తే బాగుంటుంది
ప్రభుత్వం ప్రతీ మండలానికి ఒక డేట్ అకాడమీ సెంటర్‌ను ఓపెన్ చేస్తే మరింత మంది క్రీడాకారులను తయారు చేయవచ్చు. ప్రతీ జిల్లాలో ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్‌లను ప్రభుత్వం నియమించాలి. 2010 నుంచి కోచ్‌ల నియామకం నిలిచింది. కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకుంటున్నారు. మా పాఠశాల నుంచి ఎనిమిది మంది వరకు నేషనల్ క్రీడాకారులున్నారు. నేషనల్ స్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకున్నా రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. పాఠశాలలో నిత్యం ఉదయం 5.30 నుంచి 6.30గంటల వరకు, సెలవు దినాల్లో నాలుగు గంటలపాటు ప్రాక్టీస్ చేయిస్తున్నాం.
– మాసవేని వనిత, ఈఎంఆర్‌ఎస్,
కాగజ్‌నగర్, స్టేట్ లెవెల్ మహిళా విభాగం కోచ్
జాతీయస్థాయికి ఎదిగిన అక్షర
మంచిర్యాలఅర్బన్: ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో స్థానిక శ్రీచైతన్య పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రేగూరి అక్షర మండల స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై ంది. అక్షర ఫుట్‌బాల్ అంటే ఆసక్తి చూపడంతో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మొదటిసారి నిర్వహించిన పోటీల్లో మైదానంలోకి అడుగుపెట్టిన అక్షర మండల స్థాయి, జిల్లా, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టులో చోటు సాధించింది. నల్గొండ జిల్లాలో అండర్–17లో బాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబర్ 18 నుంచి 22వరకు జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది.
బాల్ కొడితే గెలుపే..
ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్, రామకృష్ణాపూర్, సిద్దిపేటలో నిర్వహించిన అండర్–14 విభాగంలో మొదటి స్థానం సాధించాను. ఒడిశాలో నిర్వహించిన ఈఎంఆర్‌ఎస్ పరిధిలో నేషనల్ లెవెల్‌లో పాల్గొన్నాను. ఫుట్‌బాల్ ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకుని నేషనల్‌లో ఆడి సత్తా చాటాలనుంది.
– రితక
పీడీ శిక్షణ ఇవ్వడంతోనే..
నేను ఆరో తరగతిలో పాఠశాలలో చేరాను. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నాను. పీడీ మేడం ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర, నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి, ఒడిశాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. – అజ్మీర మురళీకృష్ణ
ఇండియా తరఫున ఆడాలన్నదే లక్ష్యం
పాఠశాల స్థాయి నుంచి జాతీయస్థాయి పోటీల్లో ఆడాను. అండర్–14 విభాగంలో గతేడాది కొల్లాపూర్‌లో నిర్వహించిన స్టేట్ లెవెల్ పోటీల్లో ఆడి నేషనల్‌కు ఎంపికయ్యారు. నవంబర్‌లో ఒడిశాలో నిర్వహించిన ఎస్జీఎఫ్ పోటీల్లో టీంలో బెస్ట్ ప్లేయర్‌గా ఆడాను. భారత్ తరఫున ఆడాలన్నదే లక్ష్యం.
– ఎలబోయిన అభిలాష్
కొడితే గోల్ పడాల్సిందే
ఫుట్‌బాల్ ఆటలో దిగానంటే బాల్ కొడితే గోల్‌లో పడాల్సిందే. ఎస్జీఎఫ్, ఖేలో ఇండియా పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయిలో ఆడి గుర్తింపు పొందాను. నేషనల్ స్థాయిలో ఆడుతాను. మా పీడీ చొరవతో ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాణిస్తున్నారు. నాకు కూడా మంచి కోచ్ కావాలని ఉంది. – నిఖిత
అందరూ ఆడడం చూసి..
పాఠశాలలో అందరూ ఆడడం చూసి ప్రాక్టీస్ చేసి నేషనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఆడాను. వనపర్తిలో నిర్వహించిన స్టేట్‌లెవెల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చాను. రామకృష్ణాపూర్, ఒడిశాలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాను. ఇండియా ఫుట్‌బాల్ జట్టులో ఆడాలన్నదే నా లక్ష్యం. – అజ్మీర హారిక
ఉన్నత స్థాయిలో స్థిరపడాలని..
నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పాఠశాలలో సాయంత్రం వేళ నా స్నేహితులు ఫుట్‌బాల్ ఆడుతుంటే చూసి గతేడాది నుంచి నేనూ గ్రౌండ్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నాను. గతేడాది వనపర్తిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేషనల్ లెవెల్‌లో అడి ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ఉంది. – దీక్షిత
ఆర్మీలో చేరి దేశసేవ చేయాలని..
మాది పేద కుటుంబం. ఫుట్‌బాల్ ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని ఉంది. గతేడాది ఖేలో ఇండియా గేమ్స్‌లో రామకృష్ణాపూర్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాను. అండర్–14, 17 విభాగంలో ఒడిశాలో నిర్వహించిన ఖేలో ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నాను. – పవార్ అశ్విని
రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను
మాది మధ్య తరగతి వ్యవసాయం కుటుంబం. నేను ఆరో తరగతిలో ఏకలవ్య పాఠశాలో చేరాను. అప్పటినుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. దీంతో ఫుట్‌బాల్ కోచ్ సహకారంతో ఆటలో శిక్షణ పొంది నేషనల్ స్థాయిలో ఆడుతున్నాను. ప్రతీరోజు పాఠశాలలో ఉదయం గంట సాయంత్రం 2గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. – అల్లం రాణి
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!
ప్రోత్సహిస్తే వీళ్లు మెస్సీలే!


