తొలి ఓటు.. సంబురం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బేల మండలం మసాల(కె) గ్రామంలో ఓటరు
చేతివేలికి సిరా చుక్క పెడుతున్న సిబ్బంది
ఓటు వేయడానికి అంధురాలైన తన అత్తను తీసుకొస్తున్న కోడలు
బేలలోని పోలింగ్ కేంద్రంలో క్యూలో ఓటర్లు
20న కొలువుదీరనున్న కొత్త పంచాయతీ పాలకవర్గాలు
కైలాస్‌నగర్: పంచాయతీ ఎన్నికలు మూడు వి డతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొ దటి, రెండో విడత ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా తుది విడత ఎన్నికలు ఈ నెల 17న నిర్వహించనున్నారు. ఈ మూడు విడతల్లో ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసేలా తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈమేరకు ఆ శాఖ డైరెక్టర్ జి.శ్రీజన ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20న ఆదిలాబాద్ జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అదే రోజున సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు
కై లాస్‌నగర్: మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న బోథ్, సొనాల, బజార్‌హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపా రు. అభ్యర్థులు ఈ నెల 15న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాలని పేర్కొన్నా రు. తర్వాత నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన వెంటనే మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజ లు సహకరించాలని కోరారు.
కోడ్ ఉల్లంఘనపై 27 కేసులు
కై లాస్‌నగర్: జిల్లాలోని ఎనిమిది మండలాల్లో జరిగిన గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నిక ల సందర్భంగా కోడ్ ఉల్లంఘనపై 27 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటనలో తెలిపారు. భీంపూర్‌లో ఒకటి, ఆదిలా బాద్ రూరల్‌లో 8, మావలలో 2, తాంసిలో 3, బేలలో 4, జైనథ్‌లో 9 కేసుల చొప్పున ఆరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు అడ్డుపడిన, నియమావళిని ఉ ల్లంఘించిన,మద్యం, బహుమతులు పంపిణీ చేస్తూ, ఎన్నికల ప్రచారం పర్వం ముగిశాక ప్ర చారం చేసిన 66 మందిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. పల్లె తొలిపౌరుడిని ఎన్నుకునేందుకు యువత ఆసక్తి చూపింది. స్థానికంగా ఉన్న వారితో పాటు దేశ, విదేశాల్లో ఉన్న వారు కూడా సొంతూరుకు విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు వేసి సంబురపడ్డారు. మనోగతం వారి మాటల్లోనే.. –తాంసి
తొలి ఓటు.. సంబురం
తొలి ఓటు.. సంబురం


