మలి విడతలోనూ ‘హస్తం’ జోరు
జీపీలు
కై లాస్‌నగర్: జిల్లాలో నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ విడతలో 139 సర్పంచ్, 1,146 వార్డుమెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మె జార్టీ స్థానాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పలు చోట్ల అధికార కాంగ్రెస్, బీజేపీలు బలపర్చిన అభ్యర్థుల నడుమ నువ్వా నే నా అన్నట్లుగా పోటీ సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆరు మండలా లు, బోథ్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ స్థానికంగా తన బలాన్ని చాటుకుంది. అధికార కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చి రెండో స్థానానికి ఎగబాకింది. పలుచోట్ల ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో జయాపజయాలు పదుల సంఖ్యల ఓట్లతో దోబూచులాడాయి. కొన్ని చోట్ల రెండు, మూడు ఓట్ల తేడాతోనూ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి మొత్తంగా కాంగ్రెస్ 56 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోగా, బీఆర్‌ఎస్ 30 చోట్ల విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబా ద్ నియోజకవర్గంలో ఆ పార్టీ బలం పుంజుకుంది. కమలం పార్టీ మద్దతుదారులు 45 మంది గెలుపొందారు. స్వతంత్రులు సైతం మూడు పార్టీలకు గట్టి పోటీనిచ్చారు. 25మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. సర్పంచ్‌ల ఫలితాల ను అధికారికంగా ప్రకటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉ ప సర్పంచ్‌ల ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లకు ఆర్‌వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభిమాన నాయకులు గెలుపొందడంతో అనుచరులు టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పూ లమాలలతో సత్కరించారు.
ఆయా మండలాల్లో పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌ల వివరాలు..
మండలం ఎన్నికలైన కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
ఆదిలాబాద్‌రూరల్ 31 09 02 11 09
బేల 31 13 08 08 02
జైనథ్ 17 07 02 05 03
సాత్నాల 17 04 04 09 00
భోరజ్ 17 04 03 04 06
మావల 03 01 00 01 01
భీంపూర్ 26 12 07 04 03
తాంసి 14 06 04 03 01
ప్రముఖుల సొంతూళ్లలో..
సాక్షి,ఆదిలాబాద్: రెండో విడత ఎన్నికల్లో ఆదిలా బాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వగ్రామం జైనథ్ మండలం అడలో బీజేపీ కి చెందిన కుర్సంగే నిర్మ ల ఏకగ్రీవం అయ్యారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షు డు జోగు రామన్న స్వగ్రామమైన జైనథ్ మండలం దీపాయిగూడలో బీఆర్‌ఎస్‌కు చెందిన మౌనిషా రెడ్డి గెలుపొందారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్వగ్రామమైన వడూర్‌లో అన్ని పార్టీలు బలపర్చిన దత్తు యాదవ్ విజేతగా నిలిచారు.


