నిఘా నీడన గ్రామాలు
8లోu
న్యూస్‌రీల్
139 సర్పంచ్ .. 1,146 వార్డు స్థానాలకు ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం తేలనున్న 520 మంది అభ్యర్థుల భవితవ్యం
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకం. పోలీసుల సూచనతో ఆయా గ్రామాల్లో వీటి ఏర్పాటుకు పల్లెజనం ముందుకు వస్తున్నారు.
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ప్రశాంతంగా ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష
కై లాస్‌నగర్: జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌లోని ఐదు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్, మావలలోని చావర అకాడమీ ఉన్నత పాఠశాల, బోథ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, ఉట్నూర్‌లోని పూలా జీబాబా ఏ, బీ కేంద్రాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.1291 మందికి గాను 942 మంది హాజరైనట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
కై లాస్‌నగర్: జిల్లాలో రెండో విడత పల్లె సమరానికి సర్వం సిద్ధమైంది. ఈమేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎనిమిది మండలాల్లో 156 పంచాయతీలు, 1,260 వార్డులుండగా అందులో 17 సర్పంచ్, 114 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 139 సర్పంచ్, 1,146 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సర్పంచ్ పదవుల కోసం 520మంది బరిలో నిలువగా వార్డుమెంబర్ స్థానాలకు 2,496 మంది పోటీ పడుతున్నారు. వీరి భవితవ్యాన్ని 1,32,438 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,146 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,375 మంది పీవోలు, 1509 మంది ఓపీవోలను నియమించారు. ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతీ పోలింగ్ కేంద్రానికో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని నియమించారు. పోలింగ్ ప్రారంభం నుంచి ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహణ వరకు జరిగే ప్రక్రియను వీరే పర్యవేక్షించనున్నారు. నాలు గు, ఐదు పోలింగ్ కేంద్రాలను కలిపి ఒక జోనల్ ఆఫీసర్ చొప్పున 34 మందిని నియమించా రు. మొత్తం పోలింగ్ కేంద్రాలను 36రూ ట్లుగావిభజించి ఒక్కో రూట్‌కు ఓ రూట్ ఆఫీ సర్‌ను నియమించారు.
ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ..
పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. నిర్దేశిత సమయంలోపు కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ముగిశాక గంట పాటు భోజన విరామం ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపడుతారు. ప్రతీ రెండు గంటలకోసారి పోలింగ్ సరళిని ప్రకటిస్తారు. సర్పంచ్ అభ్యర్థులకు పింక్ కలర్ బ్యాలెట్ పేపర్, వార్డుమెంబర్ అభ్యర్థులకు వైట్‌కలర్ బ్యాలట్ అందిస్తారు. ప్రతీపోలింగ్ కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. సర్పంచ్, వార్డుమెంబర్లకు సంబంధించిన రెండు ఓట్లు ఇదే బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. కౌంటింగ్ ము గిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నికను చేపడుతారు. ఆయా మండలాల్లోని ఓట ర్లకు ఇప్పటికే బీఎల్‌వోల ద్వారా ఫొటోలతో కూడి న ఓటరు పోల్ చీటీలను పంపిణీ చేశారు.
సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
ఆయా మండలాల పరిధిలోని 36 లోకేషన్స్‌లో గల 65 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా తగు చర్యలు చేపట్టారు. 17 లోకేషన్స్‌లోని 33 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేయగా, 19 లోకేషన్స్‌లోని 32 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
ఎన్నికల విధులు నిర్వహించనున్న సిబ్బంది శనివా రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని ప్రత్యేక వాహనాల్లో బందోబస్తు నడుమ తరలివెళ్లారు. ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్ మండల కేంద్రాల్లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది, పోలీసులకు పలు సూచనలు చేశారు.
మొక్కజొన్న కొనుగోళ్లు క్లోజ్
జిల్లాలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
పకడ్బందీ ఏర్పాట్లు
ఆదిలాబాద్‌రూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జి ల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎన్నికల విధులకు హాజరు కానున్న పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఎని మిది మండలాల్లో నిర్వహించనున్న ఎన్నికలకు 962 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు. జిల్లాలో ఇప్పటికే 598 మందిని బైండోవర్ చేశామని, అలాగే 20 మంది నుంచి ఆయుధాలను సేఫ్ డిపాజిట్ కింద తీసుకున్నట్లు తెలిపా రు. ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 ఎస్సైలతో పాటు మహిళా సిబ్బంది, హోంగార్డ్స్, రిజర్వ్, సాయుధ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్, తదితరులున్నారు.
మండలం ఎన్నికలు జరిగే బరిలో నిలిచిన పోలింగ్ ఓటర్లు పంచాయతీలు అభ్యర్థులు కేంద్రాలు
ఆదిలాబాద్ రూరల్ 27 98 228 26,925
బేల 30 103 246 27,071
భీంపూర్ 21 74 168 17,831
భోరజ్ 16 60 130 14,414
జైనథ్ 16 60 136 19,035
మావల 3 11 28 4,386
సాత్నాల 15 54 116 9,896
తాంసి 11 60 34 12,880
సాత్నాల: ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈమేరకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి ప లు సూచనలు చేశారు. ఇందులో ఏపీడీ కు టుంబరావు, తహసీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట్ రాజు, తదితరులున్నారు.
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు
నిఘా నీడన గ్రామాలు


