ఆ పంచాయతీలు.. చాలా హాట్‌ గురూ! | - | Sakshi
Sakshi News home page

ఆ పంచాయతీలు.. చాలా హాట్‌ గురూ!

Dec 14 2025 8:19 AM | Updated on Dec 14 2025 8:19 AM

ఆ పంచాయతీలు.. చాలా హాట్‌ గురూ!

ఆ పంచాయతీలు.. చాలా హాట్‌ గురూ!

● ఇసుక రీచ్‌లు.. ‘రియల్‌’ ప్రాంతాల్లో తీవ్ర పోటీ ● అందరి దృష్టి పెన్‌గంగ పరీవాహక గ్రామాల పైనే.. ● లక్షల ఖర్చుకు వెనుకాడని అభ్యర్థులు ● గెలుపే లక్ష్యంగా ప్రలోభాల పర్వం

కై లాస్‌నగర్‌: జిల్లాలోని పెన్‌గంగ పరీవాహక ప్రాంతంతో పాటు పలు మండల కేంద్రాలు, పట్టణాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు ఖరీదైనవిగా మారాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజకీయ పలుకబడితో ఇసుక, రియల్‌ దందాలను శాసించే అధికారం వస్తోందనే భావనతో పలువురు బరిలోకి దిగారు. రూ. లక్షల్లో అక్రమ ఆదాయం సమకూరే అవకాశముండటంతో సర్పంచ్‌, వార్డుమెంబర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదవీ ద క్కితే ఐదేళ్ల పాటు తిరుగుండదు. ఆదాయానికి కొదవుండదు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. రూ.లక్షలు గుమ్మరిస్తున్నారు. మద్యాన్ని గ్రామాల్లో ఏరులుగా పారిస్తున్నారు. పోటాపోటీగా కుల సంఘాలతో ఒప్పందాలు, యువకులకు దావత్‌లు, ఇంటింటా డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ పోల్‌ మేనేజ్‌మెంట్‌ పకడ్బందీగా చేపడుతున్నారు.

అక్రమ దందాలతో ఆదాయం..

పెన్‌గంగ నది పరీవాహకంలోని భీంపూర్‌, బేల, జైనథ్‌, భోరజ్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసు క దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆయా గ్రామాల్లో పేరుకుపోయిన ఇసుక నిల్వలకు వీడీసీల ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నారు. ఇసుక లభ్యత ప్ర కారం ఒక్కో గ్రామంలోని నిల్వలకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు వేలం ద్వారా అప్పగిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్పంచ్‌ల పాత్రనే కీల కం. రాజకీయ పలుకుబడి ఉండటంతో తమ అక్రమ దందాకు అడ్డు రాకుండా ఉండేందుకు గా ను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు ఇసుక నిల్వలను దక్కించుకున్న వారు రూ.లక్షల్లో ముట్టజెబుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే కావడంతో ఇసు క నిల్వలు కలిగిన గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అలాగే రియల్‌ ఎస్టేట్‌ దందా అధికంగా సాగే మావల, బేల, నేరడిగొండ, బోథ్‌, ఆదిలాబాద్‌ రూరల్‌ వంటి మండలాల్లోని పలు గ్రామాల్లోనూ సర్పంచ్‌ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. కొత్తగా వెంచర్లు, లేఅవుట్‌లను ఏర్పాటు చేయాలంటే సర్పంచ్‌ అనుమతి తీసుకోక తప్పదు. ఇందుకోసం లేఅవుట్లలోని ప్లాట్ల సంఖ్య, విక్రయ ధర ఆధారంగా వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎన్నికలు ఖరీదుగా మారాయి.

ఖర్చుకు వెనుకాడని వైనం ..

అక్రమ దందాలతో ఆదాయం వచ్చే ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ పదవిని ఎలాగైనా సొంతం చేసుకో వాలని పలువురు ఆరాటపడుతున్నారు. గతంలో ఈ దందాలో ఆరితేరిన వారు రిజర్వేషన్‌ కలిసివచ్చి న చోట సర్పంచ్‌ బరిలో ఉండగా.. అనుకూలించని చోట ఉప సర్పంచ్‌ పదవీనైనా దక్కించుకుని చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వార్డుమెంబర్లుగా బరిలోకి దిగారు. సర్పంచ్‌ పదవి కోసం రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఖ ర్చు చేస్తుండగా.. వార్డుమెంబర్‌ స్థానం కోసం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు చూసి ఆయా గ్రామస్తులే ఆశ్చర్య పోతుండడం గమనార్హం.

బేల, మావల, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement