పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

Dec 15 2025 8:49 AM | Updated on Dec 15 2025 8:49 AM

పోలిం

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

జీపీలు ఓట్లు ఓట్లు శాతం

ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు

స్వచ్ఛందంగా కదిలిన ఓటర్లు

పోలింగ్‌ శాతం 86.68 నమోదు

రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు

విజేతల గెలుపు సంబరాలు

జిల్లాలో రెండో విడత నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు..

మండలం ఎన్నికలైన మొత్తం పోలైన పురుషులు మహిళలు పోలింగ్‌

ఆదిలాబాద్‌రూరల్‌ 27 26925 23393 11601 11792 86.88

బేల 30 27071 22970 11737 11233 84.85

భీంపూర్‌ 21 17831 15135 7427 7708 84.88

భోరజ్‌ 16 14414 12868 6398 6470 89.27

జైనథ్‌ 16 19145 16791 8342 8449 88.21

మావల 03 4386 3700 1788 1912 84.36

సాత్నాల 15 9896 8685 4353 4332 87.76

తాంసి 11 12880 11260 5527 5733 87.42

20.05 58.00 83.96

19.63 59.09 82.66

24.93 59.99 81.16

23.60 55.49 87.09

19.42 56.45 85.87

16.46 53.06 77.43

28.00 63.46 85.85

24.26 57.30 83.38

పోలింగ్‌ శాతం సరళి ఇలా..

పల్లె చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రామ ప్రథమ పౌరులతో పాటు వార్డుమెంబర్లు ఎన్నికయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్‌ నిర్వహించగా.. అనంతరం కౌంటింగ్‌ చేపట్టారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. హోరా హోరీ పోరులో విజేతలుగా నిలిచిన వారి సంబురం అంబురాన్నంటింది. అనంతరం ఉపసర్పంచ్‌ల ఎన్నిక తంతును అధికారులు పూర్తి చేశారు.

– కై లాస్‌నగర్‌

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్‌, బేల, భోరజ్‌, సాత్నాల, జైనథ్‌, మావల, బోథ్‌ నియోజకవర్గంలోని తాంసి, భీంపూర్‌ మండలా ల్లోని 139 పంచాయతీలు, 1,146 వార్డుస్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. పల్లె ఓటర్లు వణికిస్తున్న చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. నిర్ణీత సమయం లోపు క్యూలో ఉన్న వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. యువతతో పాటు మహిళలు, పురుషులు, వృద్ధులు స్వచ్ఛందంగా కేంద్రాల కు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నా రు. మొత్తంగా ఈ విడతలో 86.68 పోలింగ్‌ శాతం నమోదైంది. ఆదిలాబాద్‌ రూరల్‌, భీంపూర్‌, మావ ల మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌లు పరిశీలించా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

నెమ్మదిగా మొదలై.. తర్వాత పుంజుకుని

ఆయా మండలాల పరిధిలో మొత్తం 1,32,438 మంది ఓటర్లు ఉండగా, 1,14,802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 64,577 మంది పురుష ఓటర్లకు గాను 57,173 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 67,861 మందికి గాను 57,629 మంది ఓటు వేశారు. చలి తీవ్రత కారణంగా తొలుత పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగా సాగింది. ఉదయం 7నుంచి 9గంటల వరకు కేవలం 21.80 శాతం మాత్రమే నమోదైంది. క్రమేణ పుంజుకుంది. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా కదలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను కుటుంబీకులు ఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి ఓటు వేయించారు. వారికి కేంద్రాల్లో వీల్‌చైర్‌ సౌకర్యం కల్పించారు. 9గంటల తర్వాత అన్ని చోట్ల ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 11 గంటల వరకు 58.17 శాతం నమోదైంది. పోలింగ్‌ ముగిసే నిర్ణీత సమయం ఒంటి గంట వరకు 83.80 శాతం నమోదైంది. అప్పటికే పలు చోట్ల క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో మధ్యాహ్నం 3గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. చివరకు 86.68 శాతం నమోదైంది. ప్రతి రెండు గంటలకోసారి అధికారికంగా పోలింగ్‌ సరళిని ప్రకటించారు.

రాత్రి వరకు సాగిన లెక్కింపు..

మావల, ఆదిలాబాద్‌ రూరల్‌, సాత్నాల, బేల, భోరజ్‌ మండలాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ రాజర్షి షా, ట్రెయినీ కలెక్టర్‌ సలోని చాబ్రాతో కలిసి పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియపై ఆరా తీశారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్‌ తీరును పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రి య చేపట్టారు. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. తర్వాత స ర్పంచ్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రి య రాత్రి వరకు కొనసాగింది. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా చోట్ల ఆలస్యమయ్యాయి. గెలుపొందిన సర్పంచులు తమ అనుచరులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ 1
1/3

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ 2
2/3

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ 3
3/3

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement