వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు
కై లాస్‌నగర్: జిల్లాలో కొంతమంది తన పేరిట దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి యజ మానులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్వాడీ ధర్మశాలలో ‘సురక్షిత ఆహారం–ఆరోగ్యం’ అంశంపై హోట ళ్లు, బేకరీలు, కిరాణ, స్వీట్‌మార్ట్ యజ మానులు, వినియోగదారులతో శనివారం అవగాహ న సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ.. సురక్షిత ఆహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల తయారీలో నిషేధిత రంగులు వాడకూడదన్నారు. ఇందులో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దినేష్ మాటోలియా, కందుల రవీందర్, కోశాధికారి మనోహర్ కుపాట్, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


