‘రైతు భరోసా’ విడుదల చేయాలి
ఇచ్చోడ: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతు స్వ రాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెం బొర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇచ్చోడలో రైతులతో కలిసి మాట్లాడారు. ఈ ఏడాది భారీ వర్షాలతో పత్తి, సోయా తదితర పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. యాసంగి సాగుకు పెట్టుబడి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపా రు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతులు గంగయ్య, ఎల్ల య్య, ముక్రామ్, జమాల్ తదితరులున్నారు.


