24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
కై లాస్‌నగర్(బేల): బేల మండలంలోని శ్రీ దుర్గా వైన్స్‌లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించినట్లు జైనథ్ సీఐ జి.శ్రావణ్ తెలిపారు. మంగళవారం పో లీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తక్కువ సమయంలో ఎ క్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో చో రీలకు పాల్పడుతున్న టేకం జశ్వ, షిండే అజ య్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల విలువైన మద్యం, రూ.2లక్షల 40వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో బేల ఎస్సై ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.


