రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
చెన్నూర్‌రూరల్: ఈ నెల 17న జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని రచ్చపల్లి సర్పంచ్‌గా గెల్లు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వేషన్ రాడంతో గెల్లు లక్ష్మి, ఆమె కోడలు గెల్లు కొమురక్క మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కొమురక్క తన నామినేషన్‌ను ఉప సంహరించుకోవడంతో గెల్లు లక్ష్మి సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు. కాగా ఆరు వార్డుల్లో కూడా ఒక్కో నామినేషన్ రావడంతో సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నాడు జెడ్పీటీసీ... నేడు సర్పంచ్‌గా బరిలో
రెబ్బెన: గతంలో రెబ్బెన జెడ్పీటీసీగా పనిచేసిన అజ్మీర బాబురావు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గోలేటి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్న ఆయన 2001లో మొదటిసారిగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ (అప్పట్లో టీఆర్‌ఎస్) సర్పంచ్‌గా ఎన్నికైంది ఇతనొక్కడే. 2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో రెబ్బెన జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వ్ కాగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన బాబురావు టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం గోలేటి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో మరోసారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు.
సర్పంచ్ బరిలో
మాజీ ఎంపీపీలు..!
కుంటాల: మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి గంగామణి 2014లో ఎంపీపీగా, 2019లో జెడ్పీటీసీగా పదవులు చేపట్టారు. కుంటాలకు చెందిన అప్క చిన్న గజ్జారాం 2013లో సర్పంచ్‌గా, 2019లో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అందకూర్ పంచాయతీ జనరల్ మహిళ, కుంటాల పంచాయతీ జనరల్ కేటాయించగా అందకూర్ నుంచి కొత్తపల్లి గంగామణి, కుంటాల నుంచి మాజీ ఎంపీపీ ఆప్క చిన్న గజ్జారాం బరిలో ఉన్నారు.
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
రచ్చపల్లి సర్పంచ్ ఏకగ్రీవం


