కలప పట్టివేత
జన్నారం: మండలంలోని దేవునిగూడలో అక్రమంగా నిలువ ఉంచిన కలపను మంగళవారం పట్టుకున్నట్లు ఇందన్‌పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి దేవునిగూడ గ్రామానికి చెందిన గవ్వల మురళి ఇంట్లో తనిఖీ చేయగా అక్రమంగా నిలువ ఉంచిన 8 టేకు దుంగలు లభ్యమైనట్లు తెలిపారు. కర్రతో పాటు కోత మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కలప విలువ రూ.30 వేల వరకు ఉంటుందన్నారు. నిందితుడు మురళిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డీఆర్వో కుమారస్వామి, సెక్షన్ అధికారులు రవి, మధుకర్, పురుషోత్తం, ఎఫ్‌బీవోలు తన్వీర్‌పాషా, లవన్, తదితరులు పాల్గొన్నారు.


