కేసీఆర్ దీక్షతోనే రాష్ట్రం ఏర్పాటు..
ఆదిలాబాద్‌టౌన్: నాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో కేంద్రం తలొగ్గి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విజయ్ దివస్ నిర్వహించారు. తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీ మెడలు వంచడంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. కార్యక్రమలో పార్టీ నాయకులు అజయ్, సాజిదొద్దీన్, ప్రహ్లాద్, రమేశ్, స్వరూప, మమత తదితరులు పాల్గొన్నారు.


