అలాగెలాగ..!
కొన్నిచోట్ల ఇద్దరే అభ్యర్థులు బరిలో..
మనం బలపర్చిన అభ్యర్థి ఎవరంటూ పార్టీల హైరానా
గ్రామ పరిధిలో అనధికారిక పొత్తులు
కంగుతింటున్న పార్టీల ఇన్‌చార్జీలు
సర్పంచ్ ఎన్నికల్లో సిత్రాలు
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధి లోని ఆదిలాబాద్‌రూరల్ మండలంలో గల ఓ గ్రా మపంచాయతీకి ఎస్టీ (జనరల్) రిజర్వేషన్ ఖరారైంది. ఇక్కడ మొదటి నుంచి మూడు ప్రధాన పార్టీలు తాము బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని యోచించాయి. రెండో విడతలో ఈ పంచాయతీలో ఎన్నికలు ఉండగా, ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఉపసంహరణ ప్రక్రియ నేడు ఉంటుంది. ఇక్కడ రెండు కంటే ఎక్కువ నామినేషన్లు దాఖ లైనప్పటికీ ఓ ఇద్దరు అభ్యర్థులు తమకు సంబంధించి నామినేషన్ ప్రక్రియలో ఏదైన పొరపాటు జరిగి తిరస్కరణకు గురవుతుందనే ఆలోచనతో తమ సంబంధికులతోనే బినామీగా నామినేషన్లు వేయించా రు. స్క్రూటీని పూర్తికాగా ఆ నామినేషన్లు అలాగే నిలిచినప్పటికీ ఉపసంహరణలో ఆ ఇద్దరు మాత్ర మే చివరికి బరిలో నిలుస్తారనేది ఆ గ్రామంలో ఇప్పుడు చర్చ సాగుతోంది. బినామీలు తమ నామి నేషన్లను పసంహరించుకుంటారనేది ప్రచా రం జరుగుతుంది. ఇద్దరు మాత్రమే బరిలో నిలుస్తుండగా, ఓప్రధానపార్టీకి తాము బలపరిచే అభ్యర్థి ప్రత్యేకంగా లేకపోవడంతో కంగు తినాల్సి వచ్చింది. ఈ గ్రామంలో అనధికారిక పొత్తులు చేసుకొని రెండు పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని సమర్థిస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రధాన పార్టీ సందిగ్ధంలో పడింది.
అనధికార పొత్తులు..
గ్రామాల్లో అనధికారిక పొత్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పి తెచ్చి పెడుతుంది. జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీల నుంచి బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్రణాళికలు రూపొందించాయి. తాము అనుకున్నది ఒకటైతే.. అక్కడ మరో లా జరిగిపోవడంతో చివరికి తమ ప్రాతినిధ్యానికే ఎసరు వస్తుందనే యోచనలో ఆయా పార్టీల నేతలు ఉన్నారు.
సరైన ప్రణాళిక లేకపోవడంతోనేనా..
గ్రామాల వారీగా పార్టీ బలపర్చిన అభ్యర్థులను బరిలోకి దించే విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం కొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడు బయట పడుతుండడంతో పార్టీ ఇన్‌చార్జీలు కంగు తినాల్సిన పరి స్థితి ఏర్పడుతుంది. అలాంటిదే ఆదిలాబాద్ రూర ల్ మండలంలోని ఓ గ్రామంలో తేటతెల్లం కావడంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఓ పార్టీకి అక్కడి పొత్తు కారణంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇది ఆ ఒక్క గ్రామపంచాయతీ అని కాకుండా పలు పంచాయతీల్లో బయటకొస్తుండడంతో ఆయా పార్టీల కు తలనొప్పిగా మారాయి.
ఇది పరిస్థితి..
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం చివరిదైన మూడో విడతకు సంబంధించి శుక్రవారంతో పూర్తయింది. ఇక నామినేషన్ల పరిశీలన పరంగా మొదటి, రెండో విడతలు పూర్తి కాగా, శనివారంతో మూడో విడత కూడా పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టం రెండో విడతకు సంబంధించి శనివారం పూర్తి కానుండగా, మూడో విడతకు సంబంధించి వచ్చే మంగళవారంతో పూర్తి కానుంది. ఉపసంహరణ ఘట్టాల ప్రక్రియ కొలిక్కి వస్తుండడంతో గ్రామాల్లో ఇలాంటి సిత్రాలు బయటకొస్తున్నాయి. కొన్నిచోట్ల చివరికి ఇద్దరే అభ్యర్థులు నిలిచే పరిస్థితి ఉండడంతో మూడో పార్టీ నేతలు తాము ప్రత్యేకంగా బలపర్చిన అభ్యర్థి లేకపోవడంతో కిం కర్తవ్యం అంటూ ఆలోచనలో పడుతున్నారు.


