● పోలింగ్ సాఫీగా సాగేలా చర్యలు ● జిల్లాలో 50 కేంద్రాల్
కై లాస్‌నగర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో తలెత్తిన ఘటనల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 229 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నారు. ఆయా కేంద్రాలపై జిల్లా అధికారులు నిరంతరం నిఘా ఉంచేలా వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది.
ప్రశాంత పోలింగ్ లక్ష్యం...
జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకమైన 102 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్‌ను నియమించనున్నారు. బ్యాంకు, రైల్వే, పోస్టల్‌శాఖల ఉద్యోగులను ఎంపిక చేశారు. వారికి శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే మరో 127 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఉన్నతాధికారులు ఆయా కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ తీరును పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ పర్యవేక్షించే సిబ్బందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు.
విడతల వారీగా ఇలా..
ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు
గతంలో స్థానిక ఎన్నికలు జరిగిన సమయంలో గ్రామాల్లో తలెత్తిన సంఘటనల ఆధారంగా సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశాం. అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించేలా వెబ్ కాస్టింగ్‌తో పాటు మైక్రోఅబ్జర్వర్స్‌ను నియమిస్తున్నాం. వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నాం. ఎన్నికలు సాఫీగా సాగేలా చర్యలు చేపడుతున్నాం.
– జి.రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి


