ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇచ్చోడ: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహ కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండలంలోని గుండాల, కేశవపట్నం, అడేగామ(బి), ఇచ్చోడ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి మా ట్లాడారు. ఎన్నికల్లో వేలం పాటలు నిర్వహించడం చట్టా రీత్యా నేరమన్నారు.
నామినేషన్ కేంద్రాల పరిశీలన
తలమడుగు: మండలంలోని సుంకిడి, తలమడుగు గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పరిశీలించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శంకర్ తదితరులున్నారు.


